: ఫార్మా విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్
తెలంగాణ ఐటీ మంత్రి కె.తారకరామారావు హైదరాబాదులో జరిగిన అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ విద్యార్థి సమాఖ్య సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కచ్చితమైన ఫలితాలనిచ్చే ఔషధాలను చవకగా తయారుచేయడంపై ఫార్మా స్టూడెంట్లు దృష్టిపెట్టాలని సూచించారు. ఔషధ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని తెలిపారు. అంతకుముందు, ఆయన జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు నివాళులర్పించి సదస్సును మొదలు పెట్టారు. కాగా, ఈ సదస్సుకు భారత విద్యార్థులతో పాటు పలు దేశాలకు చెందిన విద్యార్థులు కూడా హాజరయ్యారు. సదస్సుకు మారియట్ హోటల్ ఆతిథ్యమిచ్చింది.