: పోలికలెక్కడికి పోతాయి?: పుత్రోత్సాహంతో షారూఖ్


షారూఖ్ ఖాన్ పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోతున్నాడు. అద్దె గర్భం ద్వారా జన్మించిన అబ్ రాంపై షారూఖ్ ఎడతెగని ప్రేమ కురిపిస్తున్నాడు. అబ్ రాం పుట్టిన దగ్గర్నుంచి ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నాడు. అలాగే తన పుత్రరత్నం ఆడుకునే వీడియోను గతంలో ట్విట్టర్లో పెట్టిన షారూఖ్ తన కుమారుడికి తన పోలికలే వచ్చాయని చెబుతూ సంతోషపడిపోయాడు. షారూఖ్ సిగ్నేచర్ స్టిల్ గా పేరొందిన ఓ స్టైల్ ను తన కుమారుడు అనుకరిస్తున్నాడని అభిమానులకు చెప్పాడు. అంతే కాదు, తన లాగే రెండు చేతులూ పక్కకి చాపి ఆలింగనం చేసుకుంటున్నాడని షారూఖ్ తెలిపాడు. తనలాగే చేతులు చాచిన తన కుమారుడి ఫోటోను పోస్ట్ చేస్తూ... 'జీన్స్ ఎక్కడికి పోతాయి? తండ్రి పోలికలే వచ్చాయి' అంటూ వ్యాఖ్యను కూడా జోడించాడు. సోషల్ మీడియాలో దీనికి అభిమానుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది.

  • Loading...

More Telugu News