: దేశమంతా కలాం కోసం విలపిస్తుంటే, అమ్మాయిలతో చిందులా?: అసోం సీఎంపై బీజేపీ ఎంపీ మండిపాటు


అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పై బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి మండిపడ్డారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతితో దేశమంతా విషాదంలో మునిగిపోతే, అసోం సీఎం మాత్రం అమ్మాయిలతో చిందులేశారని దుయ్యబట్టారు. బుధవారం అసోంలోని గోలాఘాట్ జిల్లాలో ఓ వేడుకలో పాల్గొన్న గొగోయ్ స్థానిక గిరిజన యువతులతో డ్యాన్స్ చేశారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అటుపై గొగోయ్ క్షమాపణలు కూడా చెప్పారు. ఇవాళ లోక్ సభలో బిధూరి ఇదే అంశాన్ని లేవనెత్తారు. దేశం ఓ మహోన్నతుడిని కోల్పోయి విలపిస్తుంటే, ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అమ్మాయిలతో డ్యాన్సులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన తరుణ్ గొగోయ్ పేరును ప్రస్తావించలేదు. కాగా, బిధూరికి మద్దతుగా పలువురు బీజేపీ సభ్యులు ఈ అంశంపై చర్చకు పట్టుబట్టారు. అయితే, స్పీకర్ సుమిత్ర మహాజన్ ఈ అంశాన్ని పట్టించుకోలేదు.

  • Loading...

More Telugu News