: ఎస్బీఐకి భారీ జరిమానా విధించిన హాంగ్ కాంగ్ బ్యాంక్


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు హాంగ్ కాంగ్ కు చెందిన బ్యాంకు భారీ జరిమానా విధించింది. హాంగ్ కాంగ్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ మిలియన్ డాలర్లు జరిమానాగా చెల్లించాలని హాంగ్ కాంగ్ సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. 2012లో చైనా ప్రభుత్వం చేసిన మనీ ల్యాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘించిందనే కారణంతో హాంగ్ కాంగ్ బ్యాంకు ఈ జరిమానా విధించినట్టు తెలుస్తోంది. 18 కార్పొరేట్ కంపెనీలకు చెందిన చెక్కుల విషయంలో రాజుకున్న వివాదంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు భారీ జరిమానా విధించినట్టు సమాచారం. కాగా, దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News