: తెలంగాణ వాసులకు స్వచ్ఛమైన కల్లు అందిస్తాం: కేసీఆర్


రానున్న రోజుల్లో తెలంగాణ వాసులకు స్వచ్ఛమైన కల్లు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇందుకోసం తెలంగాణలోని అన్ని చెరువుల గట్ల మీద ఐదు కోట్ల ఈత చెట్లు నాటాలని నిర్ణయించినట్టు చెప్పారు. నూతన మద్య విధానంపై ఈ రోజు ఉన్నత స్థాయి అధికారులతో సచివాలయంలో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈత చెట్లు మాయమయ్యాయని ఆరోపించారు. ఆంధ్ర పాలకుల వల్లే రాష్ట్రంలో కల్తీ కల్లు ఏరులై పారుతోందని మండిపడ్డారు. ఈత చెట్లను పెంచడం కోసం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు.

  • Loading...

More Telugu News