: తెలంగాణలో కూడా కిలో రూ.20 చొప్పున ఉల్లి అమ్మకాలకు నిర్ణయం


ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో ఏపీలో ప్రభుత్వమే స్వయంగా తక్కువ ధరకు ఉల్లిపాయలు అమ్ముతున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలో కూడా ఇదే విధంగా అమ్మకాలు చేయాలని మంత్రి హరీష్ రావు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5 నుంచి కిలో రూ.20 చొప్పున ఉల్లి అమ్మకాలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఈ మేరకు ఉల్లి ధరపై సంబంధిత అధికారులతో ఆయన ఈ రోజు సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాలతో పాటు హైదరాబాద్ లో 40 చోట్ల ఉల్లి విక్రయాలు ఉంటాయని తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి నుంచి సాయం చేయాలని కేంద్రానికి లేఖ రాశామని, రోజుకు వంద మెట్రిక్ టన్నుల ఉల్లి అమ్మాలని నిర్ణయించామని చెప్పారు. ఇందుకోసం మహారాష్ట్రలోని నాసిక్, కర్నూలు, మలక్ పేట మార్కెట్ల నుంచి ఉల్లి కొనుగోలు చేస్తామన్నారు. వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణలో ఉల్లి సాగుకు చర్యలు తీసుకుని, హార్టికల్చర్ శాఖ నుంచి రాయితీ ఇచ్చి ఉల్లి సాగును ప్రోత్సహిస్తామన్నారు.

  • Loading...

More Telugu News