: రాహుల్ గాంధీలో ఏం చూశారు?: ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులకు పరేష్ రావల్ సూటి ప్రశ్న
పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కలవడంపై బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత పరేష్ రావల్ స్పందించారు. "గజేంద్ర చౌహాన్ ను ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కు చైర్మన్ గా నియమించడంపై రాహుల్ ఎలా స్పందించారన్నది నేను వినలేదు. మొత్తమ్మీద ఆయనకో అంశం దొరికింది. ఆయనను దానితోనైనా సంబరపడనిద్దాం. చౌహాన్ విషయమై ఏమన్నారో తెలుసుకున్నాక బదులిస్తాం. అయితే, ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులను ఓ విషయం అడగదలుచుకున్నా. రాహుల్ లో ఏం చూశారు? చైర్మన్ గా నియమితుడైన గజేంద్ర చౌహాన్ లో ఓ పొలిటికల్ వర్కర్ ను చూస్తున్నట్టయితే, మరి, రాహుల్ లో ఓ నటుడిని చూస్తున్నారా?" అని ప్రశ్నించారు.