: రాహుల్ మారాడు...సోషల్ మీడియాలో ప్రశంసలు


రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ గాంధీ అజ్ఞాత ప్రదేశానికి వెళ్లి వచ్చిన తరువాత ఆహార్యం, వ్యవహార శైలి, మాటతీరులో గణనీయమైన మార్పు కనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు రాహుల్ సమస్యలపై సూటిగా స్పందిస్తున్నారని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. ప్రతిపక్షాలపై సూటిగా, ఘాటుగా విమర్శలు చేస్తున్నారని, అయితే ఆయన మరింత ధాటిగా విమర్శలు ఎక్కుపెట్టాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. అలాగే రాహుల్ గాంధీ వేష భాషల్లో కూడా ఎంతో మార్పు కనిపిస్తోందని వారు చెబుతున్నారు. యువతరం ప్రతినిధిగా రాహుల్ కనిపిస్తున్నారని, అది ఆయనకు సానుకూలాంశంగా మారనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మారిన రాహుల్ వస్త్ర ధారణ యువకుల్లో అతని పట్ల ఇష్టాన్ని పెంచుతోందని నెటిజన్లు అన్నారు. రాహుల్ లో దూసుకుపోయేతత్వానికి లోటు లేదని, అలాగే ఎలాంటి పరిస్థితులకైనా రాహుల్ అలవాటు పడగలడని వారు పేర్కొంటున్నారు. బీహార్ లో మురికి వాడకు వెళ్లినా, అంధేరీలో బహుళ అంతస్తుల భవంతికి వెళ్లినా రాహుల్ లో ఎలాంటి మార్పూ ఉండదని వారు చెబుతున్నారు. రాహుల్ భావి భారతావనికి ప్రధాన నాయకుడుగా ఎదిగేందుకు తనను తాను మార్చుకుంటున్నాడని, అందులో భాగంగానే రాహుల్ లో తాజా మార్పు అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News