: ఆగస్టు మూడోవారంలో హైదరాబాద్ కు రాహుల్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు మూడవ వారంలో హైదరాబాద్ రాబోతున్నారు. 21, 22 తేదీల్లో నగరంలోని పలు కళాశాలలకు చెందిన విద్యార్థులతో ఆయన సమావేశమవుతారు. తరువాత వరంగల్ జిల్లా భూపాలపల్లిలో సింగరేణి కార్మికులతో రాహుల్ చర్చిస్తారు. అనంతరం అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది.