: 'గురు'దర్శనం చేసుకున్న సచిన్!


టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ప్రత్యేకతను మరోసారి చాటిచెప్పాడు. అభిమానుల ఆరాధ్యదైవమైన సచిన్ తన ఆరాధ్యదైవాన్ని సందర్శించాడు. గురుపౌర్ణిమ సందర్భంగా అంతా గుడికి వెళ్లి దేవుడ్ని దర్శించుకోగా, సచిన్ టెండూల్కర్ తన గురువైన రమాకాంత్ ఆచ్రేకర్ ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు. సచిన్ క్రికెటర్ గా రూపొందడంలో రమాకాంత్ ఆచ్రేకర్ ముద్ర మరువరానిది. దీంతో, జీవితంలో ప్రత్యేకమైన ప్రతి సందర్భంలోనూ రమాకాంత్ ఆచ్రేకర్ ఆశీర్వాదం తీసుకోవడం సచిన్ కు అలవాటు. అలాగే గురుపూర్ణిమ సందర్భంగా వీలున్న ప్రతిసారీ ఆయన ఆశీర్వాదం తీసుకోవడం సచిన్ మరువడని అతని కుటుంబ సభ్యులు పేర్కొంటారు. నేడు గురుపూర్ణిమను పురస్కరించుకుని సచిన్ తన గురుదేవుణ్ణి కలుసుకుని ముచ్చటించి, ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆచ్రేకర్ కుటుంబ సభ్యులతో సచిన్ సెల్పీలు దిగాడు.

  • Loading...

More Telugu News