: ఆ స్మార్ట్ ఫోన్ కోసం 72 గంటల్లో 10 లక్షల రిజిస్ట్రేషన్స్
ఆ స్మార్ట్ ఫోన్ ను తయారు చేసింది ఓ చైనా సంస్థ. ఆ సంస్థ ప్రారంభించి రెండేళ్లు కూడా కాలేదు. అయితేనేం, ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ప్రేమికుల్లో గుర్తింపు తెచ్చుకుంది. అదే 'వన్ ప్లస్'. ఆ సంస్థ మార్కెట్లోకి విడుదల చేయనున్న తాజా స్మార్ట్ ఫోన్ 'వన్ ప్లస్-2' కోసం ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తే, 72 గంటల్లో 10 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. కేవలం ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ లో మాత్రమే వీటి విక్రయాలు జరగనున్నాయి. దీనికన్నా ముందు విడుదలైన వన్ ప్లస్-1 స్మార్ట్ ఫోన్లు 15 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయని సంస్థ తెలిపింది. కాగా, 3జిబి ర్యామ్, 16 జీబీ అంతర్గత మెమొరీతో లభించే ఫోన్ ధర రూ. 22,999 కాగా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమొరీతో లభించే స్మార్ట్ ఫోన్ ధర రూ. 24,999.