: డ్వాక్రా మహిళలపై చంద్రబాబు అసహనం


సమస్యలు నిదానంగా పరిష్కారమవుతాయని చెబుతున్నప్పటికీ వినకుండా తనచుట్టూ చేరి రుణాల మాఫీ గురించి పదేపదే అడుగుతున్న డ్వాక్రా సంఘాల మహిళలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చిరాకు ప్రదర్శించారు. డ్వాక్రా సంఘాల రుణమాఫీ ఎప్పుడంటూ మహిళలు అడుగుతుంటే ఆయన అసహనంతో కాస్తంత ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ మధ్యాహ్నం పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు విజయవాడలో చంద్రబాబును కలిసిన సమయంలో ఈ ఘటన జరిగింది. చంద్రబాబును కలిసేందుకే వచ్చిన మరికొందరు మహిళలు వినతిపత్రాలు ఇవ్వబోయినా చంద్రబాబు తీసుకోకుండా వెళ్లిపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News