: మోదీ స్వప్రయోజనాల కోసమే ఆ మంత్రిని ఎంచుకున్నారు: కామత్


ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గురుదాస్ కామత్ ధ్వజమెత్తారు. మోదీ కొంత మేర స్వప్రయోజనాల కోసమే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు స్మృతి ఇరానీని ఎంచుకున్నారని వ్యాఖ్యానించారు. ఆమెకు పెద్దగా చదువులేదన్న విషయం తెలిసి కూడా ఆమెవైపే మొగ్గుచూపారని పేర్కొన్నారు. రాజస్థాన్ లోని భిల్వారా లో ఓ సభలో ఆయన మాట్లాడుతూ... "ఆమె (ఇరానీ) కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏమంత బాగుండేది కాదు. దాంతో, వెర్సోవాలోని ఓ హోటల్లో పనిచేసింది. ఆమె చదివింది 10వ తరగతి కావడంతో, ఆ హోటల్లో టేబుళ్లు శుభ్రం చేసేది" అని వివరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతోనే ప్రధాని మోదీ... స్మృతీ ఇరానీని మంత్రిని చేసేశారు అని కామత్ పేర్కొన్నారు. రైతుల వెతల కంటే ఆయనకు టీవీ సీరియళ్లపైనే ఆసక్తి అని వ్యంగ్యం ప్రదర్శించారు. స్మృతి ఇరానీ మోడల్ గా తన కెరీర్ ఆరంభించకముందు ముంబయిలో ఓ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో పనిచేసింది. అటుపై టీవీ సీరియళ్లతో బాగా పాప్యులరైంది.

  • Loading...

More Telugu News