: ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారు: వైకాపా నేత పార్థసారథి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి ఉందని వైకాపా నేత పార్థసారథి అన్నారు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం కేంద్రంలోని పెద్దలను చాలా సార్లు కలిశామని చెప్పారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించినందున, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని అన్నారు. విభజన కారణంగా ఏపీకి తీరని అన్యాయం జరిగిందని... ప్రత్యేక హోదా మాత్రమే రాష్ట్రానికి న్యాయం చేకూర్చగలదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. తమ కేంద్ర మంత్రులను, ఎంపీలను ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ హెచ్చరించాలని అన్నారు.

  • Loading...

More Telugu News