: వారిని క్షేమంగా విడిపించండి: కేంద్ర మంత్రికి టీడీపీ ఎంపీ లేఖ
లిబియాలో ఐఎస్ఐఎస్ చెరలో చిక్కుకున్న తెలుగువారిని విడిపించాలని కేంద్ర విదేశీ వ్యవహారాలు, ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ కు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. వారిని సురక్షితంగా స్వదేశం తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన లేఖలో కోరారు. స్వదేశానికి వస్తూ వారు బందీలుగా చిక్కుకుపోవడం పట్ల లేఖలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, లిబియాలో ఐఎస్ఐఎస్ చెరలో నలుగురు బందీలుగా చిక్కుకుపోగా, వారిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన వారు కాగా, మరొకరు శ్రీకాకుళంకు, ఒకరు రాయచూరు, మరొకరు బెంగళూరుకు చెందిన వారు. వారి కోసం లిబియా అధికారులతో చర్చలు జరుపుతున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.