: శ్రీలంకలో మళ్లీ హింస... ఎన్నికల ప్రచారంలో కాల్పులు
శ్రీలంక పార్లమెంటుకు ఆగస్టు 17 నుంచి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, అన్ని పార్టీలు తమ ప్రచారంలో మునిగిపోయాయి. ఈ క్రమంలో, కొలంబోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం తాను వచ్చిన వాహనంలోనే వెళ్లిపోయాడు. ఈ కాల్పుల్లో ఓ మహిళ దుర్మరణం పాలవగా, 12 మంది గాయపడ్డారు. వేదిక మీద నుంచి మంత్రి రవి కరుణానాయకే వెళ్లిపోయిన కాసేపటికే దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకోవడానికి యత్నిస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.