: సంప్రదింపులు జరుపుతున్నాం...వారిని క్షేమంగా తీసుకొస్తాం: విదేశాంగ శాఖ
లిబియాలో ఐఎస్ఐఎస్ కిడ్నాప్ చేసిన నలుగురు భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించామని భారత విదేశాంగ శాఖ తెలిపిింది. ఢిల్లీలో విదేశాంగ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, లిబియాలోని అధికారులతో చర్చలు ప్రారంభించామని అన్నారు. ఇంతవరకు అందిన వివరాల ప్రకారం ఆ నలుగురికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని స్పష్టం చేశారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడామని, వారిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. వారికి ఎలాంటి ప్రమాదం వాటిల్లదని విశ్వాసం వ్యక్తం చేశారు. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.