: ఆ లెక్కలు మాకొద్దు... మా హోదా మాక్కావాల్సిందే: కింజరాపు


కేవలం 14వ ఫైనాన్స్ కమిషన్ చేసిన సిఫార్సుల ప్రకారమే ఆర్థికశాఖ సహాయమంత్రి, రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పారని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంపు లెక్కలు తమకొద్దని, ఇస్తామని హామీ ఇచ్చిన విధంగా ప్రత్యేక హోదాను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో తెలుగుదేశం సభ్యులు పోరాటం కొనసాగిస్తారని, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు. నేటి మధ్యాహ్నం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందని, రాబడి కూడా తగ్గిందన్న విషయం అందరికీ తెలుసునని ఆయన వివరించారు. ప్రత్యేక హోదా ఇస్తే తప్ప మరే ఇతర మార్గాల ద్వారా కూడా జరిగిన నష్టం పూడదని అన్నారు.

  • Loading...

More Telugu News