: కేటీఆర్, కవిత, హరీష్ రావుల భవితవ్యంపై గాలి ముద్దుకృష్ణమ జోస్యం


తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ కవితల భవితవ్యంపై టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు జోస్యం చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ క్రమంలో ఆయన పదవి నుంచి తప్పుకుంటే కేటీఆర్ గానీ, కవితగానీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఇక మేనల్లుడు హరీష్ రావును కేసీఆర్ వాడుకుని వదిలేస్తారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాలి మాట్లాడారు. రాహుల్ గాంధీ, కేసీఆర్, జగన్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వారు ముగ్గురూ ఏపీని పట్టి పీడిస్తున్న రాక్షసులని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News