: ప్రిన్సిపాల్ పట్టించుకోనందువల్లే రిషితేశ్వరి చనిపోయింది: ఎమ్మెల్యే రోజా


నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై జరుగుతున్న విచారణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ర్యాగింగ్ వ్యవహారంపై యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్ బాబూరావు పట్టించుకోలేదని, అందువల్లే విద్యార్థిని చనిపోయిందని విమర్శించారు. ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. ఈ కేసులో తొలి ముద్దాయిగా బాబూరావు పేరు చేర్చాలన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోజా ఈ మేరకు మాట్లాడారు. యూనివర్సిటీకి సెలవులు ప్రకటించిన వీసీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక ఈ కేసు చార్జిషీటులో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పేరే చేర్చారని, అసలు కారకులైన నాగార్జున వర్సిటీ వీసీ, ప్రిన్సిపల్ పేర్లు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ప్రిన్సిపల్ అమ్మాయిలతో పార్టీలకు వెళుతుంటాడని, డాన్సులు వేస్తూ సరదాలు చేస్తుంటాడని అంటున్నారని, అయితే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. తహశీల్దార్ వనజాక్షి కేసులాగే దీనిని కూడా నీరుగారుస్తున్నారని రోజా ఆరోపించారు.

  • Loading...

More Telugu News