: ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి తెలంగాణ గౌరవాన్ని మంటగలిపారు: ఎర్రబెల్లి


చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి, యావత్ తెలంగాణ గౌరవాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం మంటగలిపిందని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. దీనికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల తెలంగాణకు పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ఇప్పటికీ వివిధ పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వరంగల్ లో ఓ రోజు దీక్ష చేపడుతున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News