: వావ్... కెమెరాతో ఇంగ్లీష్ చదివి హిందీలోకి అనువదించే గూగుల్ యాప్


అందివచ్చిన అధునాతన టెక్నాలజీ నానాటికీ జీవన విధానాన్ని మరింత సరళతరం చేస్తోంది. అందులో భాగమే టెక్ దిగ్గజం గూగుల్ అందిస్తున్న ఈ 'విజువల్ ట్రాన్స్ లేషన్' యాప్. ఇప్పటికే వివిధ భాషల్లో అనువాద సేవలను అందిస్తున్న గూగుల్, తాజాగా, చూసినదాన్ని హిందీ భాషలోకి అనువదించే 'విజువల్ ట్రాన్స్ లేషన్' సేవలను విస్తరించింది. దీన్ని వాడాలంటే, గూగుల్ ట్రాన్స్ లేటింగ్ యాప్ అప్ డేటెడ్ వర్షన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కెమెరా ఆప్షన్ ను ఆన్ చేసి దాన్ని ఇంగ్లీషు అక్షరాలున్న బోర్డు వైపు లేదా అనువాదం కావాలనుకున్న అక్షరాల వైపు తిప్పితే, ఆ పదాలను కోరుకున్న భాషలోకి అనువదిస్తుంది. ప్రస్తుతానికి విజువల్ ట్రాన్స్ లేషన్ సేవలు హిందీతో పాటు థాయ్, బల్గేరియన్, కాటలాన్, క్రొయేషియన్, చెక్, డానిష్, చడ్, ఫిలిపినో భాషలకు అందుబాటులో ఉంటాయని గూగుల్ తెలిపింది. కాగా, ఇప్పటికే ఈ సేవలను ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ భాషల్లో గూగుల్ అందిస్తున్న సంగతి తెలిసిందే. తాము రోజుకు 90 భాషలకు చెందిన 100 బిలియన్ పదాలను అనువదిస్తున్నామని, ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి ఆరుగురిలో ఒకరు గూగుల్ ట్రాన్స్ లేషన్ సేవలను వాడుకుంటున్నారని సంస్థ ప్రొడక్ట్ మేనేజర్ జూలీ కటియావ్ వివరించారు.

  • Loading...

More Telugu News