: హైదరాబాదులోని అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకునే మద్యం పాలసీ: కేసీఆర్


అక్టోబర్ నుంచి నూతన మద్యం పాలసీని అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఈ మద్యం విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. గుడుంబా మహమ్మారితో ఎన్నో కుటుంబాలు అనాథలు అవుతున్నాయని... ప్రాణాలకు హాని కలిగించని మద్యాన్ని తయారు చేయాలని అన్నారు. హైదరాబాదులో ఎన్నో ప్రాంతాల ప్రజలు ఉన్నారని... అందువల్ల అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని నూతన మద్యం పాలసీని తెస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News