: జగ్గారెడ్డి అవకాశవాది!... బీజేఎల్పీ నేత లక్ష్మణ్


బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించిన మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)పై ఆ పార్టీ శాసనసభా పక్షనేత లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తో ఢిల్లీలో భేటీ అయిన జగ్గారెడ్డి కాంగ్రెస్ లో పున:ప్రవేశానికి సంబంధించి గ్రీస్ సిగ్నల్ పొందిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కొద్దిసేపటి క్రితం లక్ష్మణ్ ఘాటుగా స్పందించారు. జగ్గారెడ్డిని అవకాశవాదిగా ఆయన అభివర్ణించారు. జగ్గారెడ్డి లాంటి నేతలు పార్టీని వీడినా బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News