: పార్లమెంటులో తీరు మారని విపక్షాల వైఖరి... వెంకయ్య ఫైర్
పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాల తీరు ఏమాత్రం మారలేదు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఉభయ సభల్లో వ్యాపం, లలిత్ మోదీ వ్యవహారాలపై నిరసన వ్యక్తం చేశాయి. ప్లకార్డులు చేతబట్టి నినాదాల హోరు వినిపించాయి. విపక్షాల నినాదాలతో ఉభయసభలు దద్దరిల్లుతున్నాయి. ప్లకార్డులను ప్రదర్శించరాదని స్పీకర్ సుమిత్రా మహాజన్ చేసిన సూచనలను ఆయా పార్టీల ఎంపీలు పట్టించుకోలేదు. దీంతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు లేవనెత్తే ప్రతి అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించిన వెంకయ్య, అనవసర రాద్ధాంతం చేయొద్దని ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. అయినా పరిస్థితి సద్దుమణగకపోవడంతో ఉభయసభలు వాయిదా పడ్డాయి.