: ఢిల్లీలో తెలంగాణ రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగుల ధర్నా


తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన ఏపీ స్థానికత విద్యుత్ ఉద్యోగుల ఆందోళన కొనసాగుతోంది. హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాలు ఆదేశించినప్పటికీ విధుల్లోకి తీసుకోకపోవడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. టీడీపీ ఎంపీలు తోట నర్సింహం, రవీంద్రబాబు వారికి సంఘీభావం తెలిపారు. వైసీపీ ఎంపీలు మేకపాటి, పొంగులేటి, అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు కూడా ధర్నాకు మద్దతిచ్చారు. ఉద్యోగులను తొలగించడం సరికాదని, వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని ఎంపీ మేకపాటి కేంద్రాన్ని కోరారు.

  • Loading...

More Telugu News