: కడపలో అంతర్రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు
కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న అంతర్రాష్ట్ర దొంగను కడపలో సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.5.23 లక్షల నగదు, నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న దొంగను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారని తెలిసింది.