: రిషితేశ్వరి సూసైడ్ పై మూడో రోజు విచారణ... గుంటూరు కలెక్టర్, ఐజీ హాజరు


బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై ఏపీ సర్కారు నియమించిన విచారణ కమిటీ తన మూడో రోజు విచారణను గుంటూరులోని నాగార్జున వర్సిటీలో కొద్దిసేపటి క్రితం ప్రారంభించింది. నేటి విచారణకు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, గుంటూరు రేంజీ ఐజీ సంజయ్ సహా ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఇప్పటికే కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, హాస్టల్ సిబ్బందిని కమిటీ విచారించిన సంగతి తెలిసిందే. ఆదివారంలోగా విచారణను ముగించనున్న కమిటీ ఆదివారం సాయంత్రం కాని సోమవారం ఉదయం కాని ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News