: ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో రిషితేశ్వరి పేరెంట్స్... మరికాసేపట్లో చంద్రబాబుతో భేటీ
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సీనియర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి తల్లిదండ్రులు కొద్దిసేపటి క్రితం విజయవాడలోని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నేటి ఉదయం ఏపీ మానవ వనరుల శాఖ మంత్రిని కలిసిన వారు, ఆ తర్వాత నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మరికాసేపట్లో వారు సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. తమ కూతురు ఆత్మహత్యకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు చంద్రబాబును కోరనున్నారు.