: బీహార్ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ... రసవత్తరంగా రాజకీయం
ఈ ఏడాది చివర్లో బీహార్ లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీలు ఎత్తులు, పైఎత్తులు వేస్తూ రాజకీయాన్ని రసకందాయంగా మార్చివేశాయి. ఇప్పటికే బీజేపీ మిత్రపక్షాలు ఒక కూటమిగా... ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్, ఎన్సీపీలు మరో కూటమిగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో నితీష్, లాలూ కూటమితో తాము చేయి కలపబోమని సీపీఐ నేత గురుదాస్ గుప్తా స్పష్టం చేశారు. అంతేకాకుండా, సీపీఐ, సీపీఎం, సోషలిస్ట్ యూనిటీ సెంటర్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు కలసి ఒకే కూటమిగా బరిలోకి దిగుతాయని ఆయన వెల్లడించారు. ఆగస్ట్ 7వ తేదీన సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చలు జరుపుతామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు తమ అభ్యర్థులను నిలుపుతామని చెప్పారు. దీంతో, బీహార్లో ముక్కోణపు పోటీకి తెరలేచింది.