: నలుగురు భారతీయులను అపహరించిన ఐఎస్ఐఎస్
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కన్ను భారతీయులపై పడింది. లిబియాలోని ట్రిపోలీ సమీపంలో నలుగురు భారత పౌరులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అపహరించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఉగ్రవాదుల నుంచి ఇంతవరకూ ఎటువంటి డిమాండ్లూ రాలేదని ఆయన తెలిపారు. వీరిని విడిపించేందుకు అక్కడి దౌత్యాధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, వీరి పరిస్థితి ఎలా ఉందన్న విషయమై సమాచారం అందక పోవడంతో ఆందోళన నెలకొంది. ఇటీవలే ట్రిపోలీలోని విమానాశ్రయాన్ని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఆక్రమించగా, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు భద్రతా దళాలు ఎంతో శ్రమిస్తున్న సంగతి తెలిసిందే.