: 50 మంది దొంగలు పడి దోచుకెళ్లారు!


ఒడిశాలోని రాయగఢ్ సమీపంలో భారీ రైలు దోపిడీ జరిగింది. కోర్బా నుంచి విశాఖ వస్తున్న కోర్బా లింక్ ఎక్స్ ప్రెస్ రైల్లో దొంగలు విరుచుకుపడ్డారు. వీరూవారు అని తేడా లేకుండా అందరినీ దోచుకున్నారు. ఎస్1, ఎస్2, ఎస్3, ఎస్5, ఎస్6 బోగీలపై ఒకేసారి దాడి చేసి సుమారు రూ. 10 లక్షల విలువైన నగదును, అంతకుమించి విలువైన నగలను లాక్కు వెళ్లారు. ఒక్కో బోగీపై పది మంది వరకూ ఒకేసారి దాడి చేశారని, మొత్తం 50 మందికి పైగానే ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. విశాఖ జిల్లాకు చెందిన ఓ జంట నుంచి రూ. 4 లక్షలు దోచుకున్నట్టు తెలిసింది. రైల్లో సెక్యూరిటీ లేకపోవడం పట్ల ప్రయాణికులు తీవ్రంగా విమర్శించారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News