: ఉద్యోగ విభజనపై ఢిల్లీలో నేడు పంచాయతీ
ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఉద్యోగుల విభజన విషయంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గం వెతికేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు నేడు దేశ రాజధానిలో సమావేశం కానున్నారు. ముఖ్యంగా విద్యుత్ ఉద్యోగుల విభజన సమస్యలు సృష్టిస్తుండగా, దానిపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ అధికారుల సమక్షంలో ఏపీ, తెలంగాణ సీఎస్ లు భేటీ కానున్నారు. విద్యుత్ ఉద్యోగులతో పాటు గ్రూప్-4 ఉద్యోగుల పంపకాలపైనా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.