: భగవంతుడి సమతుల్య కక్ష్యలోకి నెట్టబడ్డాను... మరణంపై కలాం ముందుగానే వ్యాఖ్యలు


భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు తన మరణం గురించి ముందే తెలిసిందా? అంటే, అవుననే అంటున్నారు ఆయనతో అత్యంత సన్నిహితంగా మెలిగిన అరుణ్ తివారీ. కలాంకు 33 ఏళ్ల పాటు సహాయకుడిగానే కాక కలాం పుస్తక రచనల్లోనూ తివారీ పాలుపంచుకున్నారు. కలాం తాజా పుస్తకం ‘ట్రాన్సెండెన్స్’లో 50వ పేజీలో ఆయన రాసిన వాక్యాలను తివారీ మననం చేసుకుంటున్నారు. ‘‘చివరకు ప్రముఖ స్వామీజీ నన్ను భగవంతుడి సమతుల్య కక్ష్యలోకి నెట్టారు. ఇక ఎలాంటి యుక్తులు అవసరం లేదు. శాశ్వతమైన అంతిమ స్థితికి నన్ను చేర్చారు’’ అంటూ కలాం ఆ పేజీలో రాశారు. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్న తివారీ, కలాంకు తన మరణంపై ముందే తెలిసిపోయిందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News