: ఎనిమిదో రోజుకు ‘ఎన్వీఎస్ఎస్’ దీక్ష... ఉప్పల్ ప్రజల స్వచ్ఛంద బంద్!


సమ్మె కాలంలో విధులకు గైర్హాజరయ్యారనే కారణంగా జీహెచ్ఎంసీ తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత, ఉప్పల్ శాసనసభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేపట్టిన దీక్ష నేటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం దిగివచ్చేదాకా దీక్ష విరమించేది లేదని తేల్చిచెప్పిన ఎన్వీఎస్ఎస్, దీక్ష కొనసాగింపునకే మొగ్గు చూపుతున్నారు. ఆయన దీక్షకు మద్దతుగా నేడు ఉప్పల్ బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ బంద్ కు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి.

  • Loading...

More Telugu News