: కలాం సోదరుడికి పాదాభివందనం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ!
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు నిన్న ఉదయం దేశం కన్నీటి వీడ్కోలు పలికింది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన కలాం సొంతూరు రామేశ్వరంలోనే ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరయ్యారు. కలాంకు అంజలి ఘటించిన సందర్భంగా మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా సోదరుడి మృతితో తీవ్ర వేదనకు గురైన కలాం సోదరుడు మరక్కయ్యర్ ను మోదీ స్వయంగా ఓదార్చారు. అనంతరం మరక్కయ్యర్ కు మోదీ పాదాభివందనం చేశారు.