: ఆత్మ పరిశీలనలో వైఎస్ జగన్!... అధినేత ప్రశ్నలతో వైసీపీ నేతల విస్మయం


ఏపీలో ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఆత్మ పరిశీలన మొదలైందట. ఈ మేరకు నిన్న జరిగిన పార్టీ ముఖ్యుల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలతో పార్టీ సీనియర్లు విస్మయానికి గురయ్యారట. సీనియర్లకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తారని జగన్ పై అపవాదు ఉన్న విషయం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా నిన్న ఆయన పార్టీ సీనియర్లకు పలు ప్రశ్నలు సంధించారట. ‘‘నేనేమైనా మారాల్సి ఉందా? నా పంథాను మార్చుకోవాలా? నాలో ఏమైనా లోపాలున్నాయా?’’ అని అడుగుతూ, పార్టీ సీనియర్లకు ఆయన షాకిచ్చారట. జగన్ ప్రశ్నలతో విస్మయానికి గురైన పార్టీ సీనియర్లు ఆ మరుక్షణమే తేరుకుని... కొన్ని సలహాలు, సూచనలను చేశారని విశ్వసనీయ సమాచారం. కేవలం ఓదార్పు యాత్రలకే పరిమితం కాకుండా ప్రభుత్వంపై విమర్శలను, పోరును మరింత పెంచాలని వారు జగన్ కు సూచించారట.

  • Loading...

More Telugu News