: ఏపీ తాత్కాలిక పాలనా కేంద్రంగా ‘మేధా టవర్స్’... నేటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఆ రాష్ట్ర కేబినెట్ నేడు భేటీ కానుంది. విజయవాడలో జరగనున్న ఈ భేటీ కోసం నిన్న సాయంత్రానికే సీఎం చంద్రబాబు విజయవాడ చేరుకున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఏడాదికి పైగా అవుతోంది. అయినా సొంత రాష్ట్రంలో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసుకోలేని ఏపీ సర్కారు, ఉమ్మడి రాజధాని హైదరాబాదు నుంచే పాలనను సాగిస్తోంది. ఈ నేపథ్యంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కనీసం శాఖాధిపతుల కార్యాలయాలనైనా ఏపీకి తరలించాలని చంద్రబాబు శతథా యత్నిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఉన్న ‘మేధా టవర్స్’లో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసి, శాఖాధిపతుల కార్యాలయాలను అక్కడ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాక చంద్రబాబు విజయవాడ నివాసం కోసం గతంలో ఎంపిక చేసిన లింగమనేని టవర్స్ ను మంత్రులు, ఉన్నతాధికారుల తాత్కాలిక బసకు వినియోగించుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాలపై నేటి కేబినెట్ భేటీ కీలక నిర్ణయం తీసుకోనుందని సమాచారం.

  • Loading...

More Telugu News