: ఆదాయ మార్గాలు అన్వేషించాలి: కేటీఆర్
గ్రామ పంచాయతీకి నిధుల సేకరణకు విలువైన భూములు వినియోగించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పంచాయతీల నిధుల సేకరణకు ఇతర మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు. షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించడం, ప్రభుత్వ స్థలాల్లో అడ్వర్టైజ్ మెంట్లు పెట్టుకునేందుకు అనుమతివ్వడం వంటి వాటిని చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ఇలాంటి పనులకు జిల్లా స్థాయిలోనే అనుమతులివ్వాలని ఆయన అధికారులకు చెప్పారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం 'గ్రామజ్యోతి' కార్యక్రమం ఆగస్టు 17 నుంచి చేపట్టనున్న సంగతి తెలిసిందే.