: దర్యాప్తు చేయకుండానే వేలెత్తి చూపితే ఎలా?: భారత్ పై పాక్ మండిపాటు


గురుదాస్ పూర్ ఘటనలో హతులైన ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచే వచ్చారని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజ్యసభలో ప్రకటించడం తెలిసిందే. ఆయన ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పాక్ స్పందించింది. ఘటనపై దర్యాప్తు చేయకుండానే ఇతరులను వేలెత్తి చూపడం ఆరోగ్యకర సరళి కాదని స్పష్టం చేసింది. పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖాజి ఖలీలుల్లా మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా పేర్కొన్నారు. దాడుల అనంతరం భారత్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గురుదాస్ పూర్ ఘటన దురదృష్టకరమని, పరస్పర సహకారం ద్వారానే టెర్రరిజాన్ని ఎదుర్కోగలమని అన్నారు.

  • Loading...

More Telugu News