: ఆంధ్రప్రదేశ్ లో బంగారు నిక్షేపాలు: జీఎస్ఐ


ఆంధ్రప్రదేశ్ లో బంగారు నిక్షేపాలు ఉన్నాయని భారత ఖనిజ అన్వేషణ సంస్థ (జీఎస్ఐ) నివేదికలో తెలిపింది. అనంతపురం, కడప జిల్లాల్లో బంగారు ఖనిజం ఉన్నట్టు జీఎస్ఐ నివేదికలో పేర్కొంది. అలాగే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో మాంగనీస్ నిక్షేపాలు ఉన్నాయని జీఎస్ఐ వెల్లడించింది. కర్నూలు జిల్లా కొలిమిగుండ్లలో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నట్టు జీఎస్ఐ స్పష్టం చేసింది. కడప జిల్లాలో లెడ్, జింక్ నిక్షేపాలు ఉన్నాయని జీఎస్ఐ తన నివేదికలో తెలిపింది. కాగా, సహజవాయు నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్ లో పుష్కలంగా ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News