: మేం చెప్పిందే నిజమైంది: పల్లె రఘునాథరెడ్డి


ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలంగాణ రాష్ట్ర సర్కారుపై మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని తెలంగాణ మంత్రులు, అధికారులు చెబుతూ వస్తున్న విషయం ఇవాళ అవాస్తవమని తేలిపోయిందని, ట్యాపింగ్ జరిగినట్టు హైకోర్టులో ఈరోజు టి.ప్రభుత్వమే అంగీకరించిందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తాము తొలుతే చెప్పామని పల్లె అన్నారు. ఇప్పుడు తాము చెప్పిందే నిజమైందన్నారు. తెలంగాణ సర్కారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కర్ణాటకలో రామకృష్ణ హెగ్డేకు పట్టిన గతే కేసీఆర్ కు కూడా పడుతుందని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఏపీని ఇబ్బందుల పాల్జేసేందుకు యత్నించారని పల్లె ఆరోపించారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవిధంగా పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై తెలంగాణ సర్కారు కక్షగట్టినట్టు వ్యవహరిస్తోందన్నారు.

  • Loading...

More Telugu News