: బాబును ఇబ్బంది పెట్టాలని చూసి, టీఆర్ఎస్ అడ్డంగా బుక్కయింది!: జూపూడి


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఇబ్బంది పెట్టాలని చూసి, ఫోన్ ట్యాపింగ్ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డంగా బుక్కయిందని ఏపీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు తమకు ఆధారాలు దొరికాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ లో తప్పు చేశామన్న భయంతోనే పెద్దలాయర్లను రప్పించుకుని న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ పేరెత్తితేనే టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడిపోతోందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News