: మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలి: కేసీఆర్
మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాలను దత్తత తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఆగస్టు 17 నుంచి 24 వరకు గ్రామజ్యోతి ఉత్సవాలు నిర్వహించనున్నామన్నారు. 15న వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో తాను గ్రామ జ్యోతి ఉత్సవాలను ఆరంభిస్తానని ఆయన తెలిపారు. గంగదేవిపల్లి మాదిరిగా గ్రామ కమిటీలు వేసి ప్రజలను భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామ సభలో ప్రజాప్రతినిధులంతా పాల్గొనేలా చూడాలని ఆయన సూచించారు. ఐదేళ్ల కోసం ప్రణాళిక సిద్ధం చేసి, అందుకు అనుగుణంగా నిధులు విడుదల చేసే విధంగా ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. గ్రామ కార్యదర్శుల పోస్టుల భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. అలాగే ఇసుక, వాణిజ్య పన్నులు తదితరాలను స్థానిక సంస్థలకు అప్పగించాలని భావిస్తున్నామని ఆయన వెల్లడించారు.