: బండి కాదు మొండి ఇది సాయం పట్టండి!
ఒక ట్రైన్ ని ప్రయాణికులు సాయం పట్టడం ఎప్పుడైనా విన్నారా? అది కూడా రెండడుగులో లేక మూడు అడుగులో కాదు, ఏకంగా ఐదు కిలోమీటర్ల దూరం! ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అక్కడి మధుర ప్రాంతంలో తిరిగే రాధారాణి ప్యాసింజర్ రైలు రోజుకి ఐదు రౌండ్లు వేస్తుంటుంది. అలాంటి ట్రైన్ సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులంతా కలసి దానిని కొంచెం ముందుకి నెట్టారు. అయినా ఏమాత్రం కదల్లేదు. దీంతో అలాగే దానిని తోసుకుంటూ ఐదు కిలోమీటర్లు వెళ్లారు. ఇది చూసిన స్థానికులు భారత దేశ చరిత్రలో ట్రైన్ ను తోసుకొచ్చిన ఘటన ఇదేనంటూ నవ్వుకున్నారు!