: వారిద్దరిని కూడా ఉరితీయాలంటున్న అసదుద్దీన్ ఒవైసీ
యాకుబ్ మెమన్ ఉరిని తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 2002 గోద్రా అల్లర్ల కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న మాయా కొద్నానీ, బాబు భజరంగీలను కూడా ఉరి తీస్తే చూడాలనుకుంటున్నామన్నారు. "ఢిల్లీలో సిక్కులను హతమార్చారు. ఎనిమిది విచారణ కమీషన్లు ఏర్పాటు చేశారు. మరి, ఈ కేసులో ఎంతమందికి మరణశిక్ష విధించారు?" అని ఒవైసీ ప్రశ్నించారు. బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన వారికి మరణశిక్ష వేయకుంటే స్వేచ్చగా తిరుగుతారు కదా? అని సూటిగా అడిగారు. ఈ తరహా కేసులన్నింటిలోనూ ప్రభుత్వం ఒకే విధంగా మరణశిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.