: గాంధీజీ ఆ వ్యాఖ్యలు వింటే, తన అహింసను పక్కనబెట్టి ఉరితీసి చంపేవారు: రామ్ గోపాల్ వర్మ


వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకెక్కారు. ముంబయి పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ కు ఉరి సరికాదని ఓ వార్తా చానల్ చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యానించిన తుషార్ గాంధీపై మండిపడ్డారు. 'టైమ్స్ నౌ' చానల్ చర్చా కార్యక్రమాన్ని చూసేందుకు గాంధీజీ ఈ లోకంలో లేరు కాబట్టి సరిపోయింది, లేకుంటే, యాకూబ్ కు ఉరి వద్దన్నందుకు మునిమనవడైన తుషార్ గాంధీని ఉరితీసి చంపేవారని ట్వీట్ చేశారు. యాకూబ్ ఉరి నిలిపివేయాలంటూ తుషార్ ఓ ఉద్యమస్థాయిలో పోరాడడాన్ని వర్మ తప్పుబట్టారు. తుషార్ బుద్ధిమాలిన వ్యాఖ్యలను గాంధీ విని ఉంటే చెంప చెళ్లుమనిపించడమే కాదు, కడుపులో గుద్దేవాడని పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన ఫొటోల్లో యాకూబ్ అందరిలానే సాధారణంగా కనిపిస్తుండడంతో అతడిపై సానుభూతి వ్యక్తమవుతోందని వర్మ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News