: అంతర్జాతీయ క్రికెట్లో పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న రైనా


టీమిండియా స్టార్ క్రికెటర్ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి సరిగ్గా పదేళ్లు పూర్తయింది. 2005 జులై 30న శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ తో రైనా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. పదేళ్ల సుదీర్ఘ కెరియర్ లో ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సురేష్ రైనా... తన తొలి మ్యాచ్ లో మాత్రం మొదటి బాల్ కే ఔట్ అయ్యాడు. ఇప్పటి వరకు 218 వన్డేల్లో 5 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 5,381 పరుగులు పూర్తి చేశాడు. అలాగే 18 టెస్టుల్లో 768 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు వన్డేల్లో 35, టెస్టుల్లో 13 వికెట్లు పడగొట్టాడు.

  • Loading...

More Telugu News