: నాడు కసబ్ ను ఉరితీసిన వ్యక్తే నేడు యాకుబ్ ను కూడా!
1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో మరణశిక్షకు గురైన యాకుబ్ మెమన్ వ్యవహారంలో చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఇతని కేసులోనే తొలిసారి సుప్రీంకోర్టులో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వాదనలు జరిగాయి. మూడేళ్ల కిందట ముంబై దాడుల కేసులో మరణ శిక్ష అమలైన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఉరిని ఎరవాడ జైల్లో నిర్వహించిన కానిస్టేబుల్ ఆధ్వర్యంలోనే ఈరోజు కూడా యాకుబ్ ఉరి అమలైందట. ఇక నవంబర్ 21, 2012న ఎరవాడలో కసబ్ ను ఉరితీసిన వ్యక్తే ఈరోజు యాకుబ్ ను కూడా ఉరితీశాడని తెలిసింది. ఓ వారం కిందట ఎరవాడ జైలు నుంచి వచ్చిన 20 మంది జైలు సిబ్బంది సభ్యుల బృందంతో కలసి అతను వచ్చాడట. ఇక నాడు ఎరవాడ జైలు సూపరింటెండెంట్ యోగేష్ దేశాయ్ నేతృత్వంలో కసబ్ ఉరి జరగగా, ఎనిమిది నెలల కిందట నాగపూర్ సెంట్రల్ జైలుకు ఆయన బదిలీ అయ్యారు. అనూహ్యంగా ఆయన పర్యవేక్షణలోనే యాకుబ్ ఉరి జరగింది. ఇక ఎరవాడ జైలు నుంచి మరో కానిస్టేబుల్ నాగపూర్ జైలుకు వచ్చి ఉరితీసే వ్యక్తికి సహాయంగా మరో ఇద్దరిని ట్రైన్ చేశాడట. మహారాష్ట్రలోని నాగపూర్, ఎరవాడ సెంట్రల్ జైళ్లలో మాత్రమే ఉరి తీసేందుకు సదుపాయాలున్నాయి. నాగపూర్ జైల్లో 1984లో ఇద్దరు సోదరులను ఉరి తీశారు.