: టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన మరో బౌలర్


టెస్ట్ క్రికెట్లో మరో బౌలర్ 400 వికెట్ల క్లబ్ లో చేరాడు. బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ ఈ ఘనత సాధించాడు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ను పెవిలియన్ కు పంపించడం ద్వారా స్టెయిన్ ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇదే సమయంలో 400 వికెట్ల క్లబ్ లో చేరిన రెండో సఫారీ బౌలర్ గా స్టెయిన్ అవతరించాడు. 80వ టెస్టులో స్టెయిన్ ఈ ఫీట్ నెలకొల్పాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ షాన్ పొలాక్ (421) ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం టెస్ట్ కెరీర్ కొనసాగిస్తున్న ఆటగాళ్లలో హర్భజన్ (ఇండియా), జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) లు కూడా 400 వికెట్ల క్లబ్ లో ఉన్నారు.

  • Loading...

More Telugu News